you can find the world in a person's diary who thinks He's the world

May 17, 2016

ఆనందం, ప్రతిబింబం

ఈ ఒక్క బ్లోగ్ పొస్ట్ కొసం ఏప్రిల్ 2010 లొ ఫ్రతిబింబం అని ఒక బ్లోగ్ స్రుష్టించాను. ఆది మళ్లీ ఎప్పుడూ వాడలేదు. కాని ఎప్పటికప్పుడు ఇది గుర్తొస్తూ ఉంది, కాబట్టి ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను
_____

ఆనందం
మనసంతా ఆనందం
ఎందుకో తెలియదు
ఏమిటో తెలియదు
ఆనందం

వర్షం ఇంకా మొదలవ్వలేదు
వాతావరణం నాకు తగలట్లేదు
తను గుర్తురానే లేదు
అయినా ఆనందమే

తెలుగు పాట వలనో తెలియదు
మన మాట వలనో తెలియదు
ఎందుకో తెలియదు
ఏమిటో తెలియదు
ఊపిరి తిత్తులకు గాలి కూడా చేరట్లేదు
అంత ఆనందం

ఇందులో స్వార్ధం లేదు
ఉత్తి ఆనందం

ఆనందం
అని జపించిన ప్రతీ సారి
మరింత ఆనందం
దీనికి అంతమూ లేదేమో
ఏమో
ఆనందం

Twitter @rkharvel

    follow me on Twitter